Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవికి జగన్ రాజీనామా... వారిలో ఎవరైనా సరే...: వర్ల రామయ్య సంచలనం

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికహక్కు లేదని... వెంటనే ఆయన పదవికి రాజీనామా చేసి ఇతరులకు బాధ్యతలు అప్పగించాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. 

tdp leader varla ramaiah sensational comments on cm ys jagan
Author
Amaravati, First Published Dec 1, 2021, 5:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: అవినీతి, అక్రమాలపై సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేసారు. సీఎంతో పాటు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిపై హైదరాబాద్ లోని సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతోందని... ఇందుకు సహకరించి సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన బాధ్యత జగన్ పై లేదా? అని ప్రశ్నించారు.  

బుధవారం varla ramaaih మంగళగిరిలోని TDP జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న(మంగళవారం) సీబీఐ కోర్టులో cbi వాదన, ఇతర ముద్దాయిల వాదన చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చిందన్నారు. దానిపైనే తానును మాట్లాడతానని... ఎవరు మన ముఖ్యమంత్రి..? ఏమిటాయన చరిత్ర? అనేది మీడియావారు ప్రజలకు ఎరుకపరచాలని... వాస్తవాలను పదిమందికి తెలియ చేయాలని కోరుతున్నానని వర్ల పేర్కొన్నారు. 

''తనతండ్రి YSR ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని YS Jagan రూ.43వేల కోట్లను అన్యాక్రాంతం చేశారన్న అభియోగాలపై సీబీఐ  ఆయనపై 11ఛార్జ్ షీట్లువేసింది.  జగన్ కి సంబంధించిన 11 ఛార్జ్ షీట్లపై విచారణ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా వైదొలగాల్సిన బాధ్యత ఆయనకులేదా?  ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెబుతారా? ఆయనతోపాటు ముద్దాయిలుగా ఉండి, ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగుతున్న ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శామ్యూల్, బ్రహ్మానందరెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యంచెప్పగలరా? అలాచెప్పగల ధైర్యంవారికి ఉంటుందా?  అందుకే ముఖ్యమంత్రిగారికి ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నమ్మిన బంట్లు ఎవరికైనా ఆ బాధ్యతలు అప్పగించాలి'' అని వర్ల సూచించారు. 

read more  వైఎస్ పేరును చెడగొడుతున్నారు : జగన్‌పై డీఎల్ రవీంద్రా రెడ్డి విమర్శలు

''ముఖ్యమంత్రి గారు నైతికవిలువలకు వీడ్కోలు పలికారా? అయ్యో నాపై విచారణ జరుగుతోంది...నేను ముద్దాయని తేలితే ఏమిటన్నఆలోచనతో మీరు తలవంచుకోరా?   ప్రజలసొమ్ము కొట్టేశారన్న అభియోగాలకు సంబంధించి ముఖ్యమంత్రిపై  హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు? ముఖ్యమంత్రి  రాజీనామాచేసి సీబీఐ విచారణకు సహకరించకపోతే, ఆయనకు నైతికవిలువలపట్ల నమ్మకంలేదనే  అందరం భావించాల్సి ఉంటుంది'' అన్నారు. 

''నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన వాన్ పిక్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి 12వేల ఎకరాలు దఖలు పరిచారు. ఆ భూమి ఖరీదు రూ.17 వేలకోట్లు ఉంటుంది. దానికి ప్రతిఫలంగా వాన్ పిక్ వారు జగన్ కి చెందిన జగతి పబ్లికేషన్స్ లో రూ.854కోట్లు పెట్టుబడిపెట్టారు. అసలు మతలబుఅంతా ఇక్కడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పత్రికారంగమనేది లాభసాటివ్యాపారంకాదు...అలాంటి వ్యాపారంలో రూ.854కోట్లు పెట్టుబడి పెట్టడం వెనకున్న అసలు కథేమిటో ప్రజలంతా గ్రహించాలి'' అన్నారు. 

read more  మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ అంతే, రూ. 1,309 కోట్లు ఇచ్చేయండి : జగన్‌కు లోకేశ్ లేఖ

''ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనేక వార్తాపత్రికలు నేడు నష్టాలబాటలో ఉన్నాయి. అమెరికాలో నష్టాలువచ్చాయని ప్రతి 5పత్రికల్లో ఒకటి మూతపడింది. ఒక్కసాక్షి పత్రికతప్ప, ప్రపంచప్రసిద్ధిగాంచిన అనేక పత్రికలు నష్టాల్లోనే ఉన్నాయి. పత్రికారంగంలోని ప్రముఖులు ఎవరిని అడిగినా అదేచెబుతారు.  అదే సమయంలో ప్రాంతీయపత్రికైన సాక్షిలో నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854కోట్లు పెట్టుబడిపెట్టాడు. దానికి కారణంఏమిటి? తాడుబొంగరంలేని సాక్షిలోనే ఎందుకు పెట్టుబడి పెట్టాడనే ప్రశ్నకు నిమ్మగడ్డ వద్ద సమాధానముందా?  ఈ వ్వవహారంపై కోర్టులో జరిగిన వాదోపవాదనలు గమనించాక ముఖ్యమంత్రి  దగాకోరని తెలియడంలేదా?'' అని మండిపడ్డారు. 

''జగన్ తండ్రి వాన్ పిక్ సంస్థకు రూ.17వేలకోట్ల విలువైన భూములిస్తే, దాని కిప్రతిఫలంగా నిమ్మగడ్డ సాక్షిలో రూ.854కోట్లు పెట్టుబడి పెట్టారనేది వాదోపవాదనల్లో చాలా క్లియర్ గా స్పష్టమైంది.  ముఖ్యమంత్రితో పాటు ముద్దాయిలుగా  ఉన్నఅనేకమంది దొంగలముఠా సభ్యులు, అవినీతి పరులే సాక్షిపత్రికలో పెట్టుబడిపెట్టారు. సీబీఐకోర్టులో జగన్ తో పాటు విచారణ ఎదుర్కొంటున్నవారంతా పెద్ద దొంగలముఠా'' అని వర్ల రామయ్య మండిపడ్ారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios