ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించిన ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు.
ఏపీలో ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు (ap high court) ఆదేశాలు జారీ చేసిన వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) సీనియర్ నేత వర్లరామయ్య (varla ramaiah) స్పందించారు. ఈ తరహా పరిస్థితి ఎదురైనప్పుడు జగన్ కాకుండా సీఎంగా ఇంకెవరున్నా పదవికి రాజీనామా చేసేవారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఐఏఎస్ అధికారులకు (ias officials) కోర్టు శిక్ష విధించిన ఘటనలు దేశ చరిత్రలోనే లేవన్నారు. న్యాయ వ్యవస్థపై సీఎం జగన్‌కు (ys jagan) ఉన్న వ్యతిరేక భావనతోనే ఐఏఎస్‌లకు జైలు శిక్ష తప్పట్లేదని వర్ల రామయ్య అన్నారు. న్యాయ వ్యవస్థ దయతో అధికారులు జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారని.. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ఐఏఎస్‌లకు జైలు శిక్ష పడిందంటూ వర్ల ఎద్దేవా చేశారు. సీఎం స్థానంలో జగన్ కాకుండా ఇంకెవరున్నా .. ఐఏఎస్‌లకు శిక్షపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేవారు అంటూ వర్ల రామయ్య అన్నారు.
కాగా.. కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఎఎస్ లకు హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై ఏపీ హైకోర్టుకు ఐఎఎస్ లు క్షమాపణ చెప్పడంతో Jail శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కుమార్, గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలారావు, రాజశేఖర్, శ్రీలక్ష్మి, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు, ఎంఎంనాయక్ లపై హైకోర్టు సీరియస్ అయింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలను హైకోర్టు గతంలో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను IAS లు అమలు చేయలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద ఎనిమిది మంది ఐఎఎస్‌లకు రెండు వారాల పాటు జైలు శిక్షను విధించింది.
ఈ విషయమై ఐఎఎస్ లు కోర్టును క్షమాపణలు కోరారు. దీంతో సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఐఎఎస్ లను కోర్టు ఆదేశించింది. జైలు శిక్షకు బదలుగా హాస్టల్ విద్యార్ధులకు సేవ చేయాలని సూచించింది.ప్రతి నెల ఏదో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఐఎఎస్ లు సేవ చేయాలని సూచించింది. అంతేకాదు ఒక రోజు పాటు కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది. 2021 సెప్టెంబర్ మాసంలో కూడా ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ సహా ఐదుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.
నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు జరిమానాను విధించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని కారణంగా కూడా హైకోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులకు కూడా జైలు శిక్ష విధించింది. అయితే ఐఎఎస్ లు క్షమాపణ కోరడంతో ఉన్నత న్యాయస్థానం సంక్షేమ హాస్టళ్లలో సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది.
