కొడాలి నానికి వల్లభనేని వంశీ సిరియస్ వార్నింగ్

First Published 26, Apr 2018, 12:22 PM IST
tdp leader vallabhaneni vamsi serious warning to ycp mla kodali nani
Highlights

సీరియస్ వార్నింగ్

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ నేత వల్లభనేని వంశీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  గతంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మంచి స్నేహితులు. కాగా.. కొడాలి నాని.. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడంతో.. వీరి స్నేహానికి పులిస్టాప్ పడింది. అయితే.. కొడాలి నాని మాత్రం.. వంశీతో తనకు ఉన్న స్నేహాన్ని ప్రచారానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ.. కొడాలి నానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

‘నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఉద్దేశించి వల్లభనేని వంశీ తీవ్రంగా హెచ్చరించారు. ఒకప్పుడు ఇద్దరం స్నేహితులమే కానీ, ఇప్పుడు కాదన్నారు. జగన్‌ పాదయాత్రలో కొడాలి నాని తనను స్నేహితుడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కొడాలి నాని పిచ్చికుక్కలా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. టీడీపీ, చంద్రబాబుతో తప్పితే నానితో స్నేహమే లేదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానిని, వైసీపీలో బరితెగించి మాట్లాడేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

loader