కడప: కడప జిల్లాలోని సోములవారిపల్లెలో టీడీపీ నేత సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం నాడు హత్య చేశారు. 

సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి దుండగులు నరికి చంపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలంలోనే సుబ్బయ్యను దుండగులు నరికి చంపారు.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా సుబ్బయ్య పోస్టులు పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కడప జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధిగా సుబ్బయ్య పనిచేస్తున్నారు. సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి నరికి చంపారు. సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది.సుబ్బయ్య హత్యతో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో గతంలో ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ  ప్రాంతంలో హత్యలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

సుబ్బయ్య హత్యతో  ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్బయ్య హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.