టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి కరోనాకు పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు గుంటూరు రమేశ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి కరోనాకు పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు గుంటూరు రమేశ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఇటీవలే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అచ్చెన్నాయుడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్యం బాగానే వుందని రమేశ్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.
అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్ధితిపై స్పందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఆపరేషన్ అయ్యిందని తెలిసి కూడా అచ్చెన్నను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్లే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడ్డారని ఆయన ట్వీట్ చేశారు.
