టిడిపికి షాక్

First Published 29, Nov 2017, 12:21 PM IST
Tdp leader mvr chowdary joins ycp
Highlights
  • తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ తగిలింది

తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ తగిలింది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఒకరు వైసిపిలో చేరారు. తూర్పు నియోజకవర్గంలో బాగా పట్టున్న మండవ వెంకటాద్రి చౌదరి (ఎంవిఆర్) ఈరోజు ఉదయం జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. చౌదరి ప్రస్తుతం తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. తన పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయలను చూసి సహించలేకే తాను పార్టీ మారినట్లు చౌదరి మీడియాతో చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎంఎల్ఏ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు చొరవతో చౌదరి వైసిపిలో చేరారు.

loader