స్పీకర్ పై వ్యాఖ్యలపై ప్రివిలేజ్ కమిటీ కి కూన వివరణ: గోప్యంగా ఉంచుతామన్న కాకాని

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ  సమావేశం గెురువారం నాడు జరిగింది.ఈ స మావేశానికి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవిమకుార్  హాజరయ్యారు. స్పీకర్ పై ఆరోపణల నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ  ముందు కూన రవికుమార్ హాజరయ్యారు. రవికుమార్  వివరణను గోప్యంగా ఉంచుతామని ప్రివిలేజ్ కమిటీ చైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

TDP leader Kuna Ravi kumar appears before AP Privileges Committee

హైదరాబాద్:  ఏపీ అసెంబ్లీ Privilege కమిటీ ముందు మాజీ ఎమ్మెల్యే, TDP నేత కూన రవికుమార్ గురువారం నాడు హాజరయ్యారు. AP Assembly స్పీకర్ Tammineni Sitaram పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై Kuna Ravi Kumar ఇవాళ  అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు.

2021 సెప్టెంబర్ 21న ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే  రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించింది కమిటీ.

అంతకు ముందు కూడా ప్రివిలేజ్ కమిటీ సమావేశం  పిలిచినా కూడా హాజరు కాలేదు. దీంతో  ప్రివిలేజ్ కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే సెప్టెంబర్ మాసంలో  జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి కూన రవికుమార్ హాజరయ్యారు. తన  వివరణను ఇచ్చారు. ఆ సమావేశానికి హాజరైన రవికుమార్ ఇవాళ జరిగిన సమావేశానికి కూడా హాజరై తన వివరణను ఇచ్చారు.

కూన రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మెన్ Kakani Govardhan Reddy చెప్పారు. అయితే ఈ విషయమై ఏం చేయాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామన్నారు.  ప్రివిలేజ్ కమిటీ ముందు  పిటిషన్లను అన్నింటిని పరిష్కరిస్తామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రవికుమార్ సమా ఇతర పిటిషన్లపై అసెంబ్లీ నివేదిక ఇస్తామని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios