గుంటూరు: తన మంత్రివర్గ సభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారంపై  ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందిచటం లేదు? అని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కేఎస్ జవహర్ ప్రశ్నించారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని నోటికి తాళం వేస్కున్నారా? అని నిలదీశారు.  

''బాలినేని జగన్ బంధువు కాబట్టి మాట్లాడం లేదా? ఎక్కడికి ఆ నిధులు తరలిస్తున్నారు?  చెన్నై నుండి ఆ నిధులు మారిషస్ కు తరలించేందుకు ప్లాన్ చేసారు అనేది వాస్తవం కాదా?'' అంటూ ప్రశ్నించారు. 

''రూ.5 కోట్లకు పైగా డ‌బ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని అడ్డంగా బుక్కయ్యారు. త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ కారు వెనుకే ఎస్కార్ట్ గా ఏపీ రిజిస్ట్రేష‌న్ కారులో మంత్రి బాలినేని త‌న‌యుడు ప్రణీత్‌రెడ్డి ఫాలో అయ్యింది వాస్తవం కాదా?  పోలీసులు తమిళనాడు వాహనం పట్టుకోవడంతో  దొరికిన ముగ్గురినీ అక్కడే వ‌దిలేసి ఎస్కేప్ అయ్యాన్నది నిజం కాదా? త‌మిళ్ న్యూస్ చాన‌ళ్లు జ‌య‌టీవీ, న్యూస్ 18 త‌మిళ్‌లో మంత్రి ఫోటోలు వేసి, ప‌ట్టుబ‌డిన‌వారు ఇచ్చిన వాంగ్మూలాన్నే ప్రసారం చేసిన సంగతి వాస్తవం కాదా?'' అని అడిగారు. 

read more తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మాట్లాడుతున్నారు: టీడీపీ నేతలపై వెల్లంపల్లి వ్యాఖ్యలు

''బిల్లుల్లేవు, ప‌త్రాల్లేవు, అస‌లు ఒక రాష్ట్రం నుంచి మ‌రో రాష్ట్రంకి ప్రయాణించేందుకు తీసుకోవాల్సిన ఈ పాస్ లేదు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌లులో వుండ‌గా ఇత‌ర రాష్ట్రాల ప్రయాణాల‌కు తీసుకోవాల్సిన అనుమ‌తీ లేదు. 25 వేలు దాటితే న‌గ‌దు లావాదేవీలు చేయ‌రు. మ‌రి 5 కోట్లు ఏ స‌రుకు కొన‌డానికి  తీసుకెళ్తున్నట్టు? ఒంగోలు నుంచి బ‌య‌లుదేరిన కార్లకు త‌మిళ‌నాడు రిజిస్ట్రేష‌న్ ఎలా వ‌చ్చాయి? ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కరో వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?
'' అని ప్రశ్నించారు. 

 ''పట్టుబడ్డ నగదు, బంగారం తనదే అని చెబుతున్న నల్లమల్లి బాలు మీ పార్టీకి చెందిన వ్యక్తి వాస్తవం కాదా? నల్లమల్లి బాలు తండ్రి బాబు అనే వ్యక్తి ఒంగోలు వైసిపి పార్టీ నుండి ఒంగోలు నగర వాణిజ్య విభాగం అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంగోలు కార్పోరేషన్ లోని 25 వ డివిజన్ నుండి వైసిపి కార్పోరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రస్తుతం పోటీలో ఉన్నారు. వాస్తవాలను భయటపెట్టాలి.  దీనిపై సమగ్ర విచారణ చేయాలి''  అని 
కేఎస్ జవహార్ డిమాండ్ చేశారు.