Asianet News TeluguAsianet News Telugu

జైలునుంచి విడుదలైన టీడీపీ నేత కొమ్మిరెడ్డి పట్టాభిరామ్..

తెలుగుదేశం నేత కొమ్మిరెడ్డి పట్టాభి జైలునుంచి విడుదలయ్యారు. నిన్న జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున పూచికత్తు ఇవ్వాలని తెలిపింది

TDP leader Kommireddy Pattabhiram released from jail, andhrapradesh - bsb
Author
First Published Mar 4, 2023, 1:41 PM IST

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టిడిపి నేత కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ విడుదలయ్యారు. శుక్రవారం నాడు జిల్లా కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రూ.25వేల చొప్పున పూచికత్తు ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటికి వచ్చిన పట్టాభికి తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని గన్నవరంలో జరిగిన ఘటన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ మీద  పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గన్నవరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి.   పట్టాభి, తెలుగుదేశం నేతలమీద పట్టాభి సిఐ కనకారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని సిఐ కనకారావు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద పట్టాభి సహా 13 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

టీడీపీ నేత పట్టాభికి ఊరట .. బెయిల్ మంజూరు చేసిన కోర్ట్, కండీషన్స్ అప్లయ్

Follow Us:
Download App:
  • android
  • ios