అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్ధి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్ధి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 

గతంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మెన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తాడిపత్రి మున్సిపాలిటీకి ఆయన ఛైర్మెన్ గా పనిచేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్మెన్ గా ఉన్న సమయంలో ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా పనిచేశారు.

తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతో అభివృద్ది చేశారు ఈ అభివృద్దితో ఈ మున్పిపాలిటీ ఆ 
సమయంలో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

2014లో జరిగిన ఎన్నికలకు ముందు జేసీ సోదరులు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. దీంతో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశాడు. అనంతపురం ఎంపీ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ అభ్యర్ధిగా వైసీపీ నుండి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడిని ప్రకటించింది.