Asianet News TeluguAsianet News Telugu

నాపై 78 కేసులు.. పూర్తి కావాలంటే ఇంకో జన్మ ఎత్తాలేమో : జగన్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు

తనపై 78 కేసులు పెట్టారని, మళ్లీ జన్మ ఎత్తితే తప్పించి ఈ కేసులు పూర్తికావని సెటైర్లు వేశారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏ కేసులో నేను కోర్టుకు వచ్చానో కూడా తెలియదన్నారు. 

tdp leader jc prabhakar reddy fires on ap cm ys jagan ksp
Author
First Published May 11, 2023, 3:16 PM IST

వైసీపీ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. గురువారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై 78 కేసులు పెట్టారని, మళ్లీ జన్మ ఎత్తితే తప్పించి ఈ కేసులు పూర్తికావని సెటైర్లు వేశారు. అయినప్పటికీ తాను కేసులకు, జైళ్లకు భయపడేది లేదని జేసీ స్పష్టం చేశారు. రాజు తలచుకుంటే కేసులకు కొదవా.. ఏ కేసులో నేను కోర్టుకు వచ్చానో కూడా తెలియదన్నారు. జూన్ 26కు విచారణను వాయిదా వేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 

రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేం కూడా ఇలానే అనుకుంటే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా కేసులు పెట్టడం సరికాదని జేసీ హితవు పలికారు. తాము పవర్‌లోకి వస్తే కేసులు పెట్టమని.. క్షమించేస్తామన్నారు. కేసులు పెట్టుకుంటేపోతే.. అందరూ కోర్టులలోనే వుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఐఏఎస్, ఐపీఎస్‌లకూ పిల్లలు వుంటారని, వాళ్లు బాధపడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా..జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్నిరోజులుగా ఆయన వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా స్పందన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీని వల్ల సమయం వృథా కావడం తప్పించి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గడిచిన రెండేళ్లలలో తాను స్పందన కార్యక్రమంలో అనేక దరఖాస్తులను ఇచ్చానని.. కానీ వాటిలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదని జేసీ తెలిపారు.

సమస్యలు పరిష్కరించని కార్యక్రమం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను రెండేళ్ల కాలంలో 16 కేజీల ఆర్జీలను స్పందన కార్యక్రమంలో అధికారులకు ఇచ్చానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను పెట్టిన అర్జీలను తూకంలో అమ్మితే 750 రూపాయలు వచ్చాయని చురకలంటించారు. అవసరమైతే అధికారుల కాళ్లు పట్టుకుంటాని.. తాను లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios