అనంతపురం: బీజేపీలో చేరాలని తనకు చాలా రోజుల నుండి ఆహ్వానం ఉందని మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాడు జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇటీవల కాలంలో ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి వ్యవసాయక్షేత్రంలో జేసీ దివాకర్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరాలని సీఎం రమేష్ జేసీ దివాకర్ రెడ్డిని కోరినట్టుగా ప్రచారం సాగింది. ఈ విషయమై ఆయన స్పందించారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రానున్న రోజుల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారాయన.

also read:వివాదాస్పద వ్యాఖ్యలు: ముస్లింలకు క్షమాపణలు చెప్పిన ఏపీ డీప్యూటీ సీఎం నారాయణ స్వామి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను  వాయిదా వేసిన విషయమై తాను మాట్లాడబోనని ఆయన చెప్పారు. ఎన్నికల కమిషన్ పై ఆలోచించాల్సిన అవసరం లేదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరుతారని కొంతకాలంగా ఊహాగాహనాలు విన్పిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి గతంలో కలిశారు. ఈ సమయంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని కూడ ప్రచారం సాగింది. ఆ సమయంలో జేసీ చేసిన వ్యాఖ్యలు కూడ ఆసక్తిని కల్గించాయి.