జగన్, పవన్ లకు ఆ దమ్ములేదన్న డొక్కా

జగన్, పవన్ లకు ఆ దమ్ములేదన్న డొక్కా

టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్.. కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు.  ఏపీ సీఎం చంద్రబాబు పడుతున్న శ్రమను కేంద్రం నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కృషివల్లే ఏపీకి పెట్టుబడుల వరద వస్తోందని అభిప్రాయపడ్డారు. బీజేపీ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. 

బీజేపీ ఏపీకే కాదు... దేశానికే అనవసరమని డొక్కా స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ కి,  జనసేన అధినేత పవన్ కి  కేంద్రాన్ని నిలదీసే దమ్ములేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. వైసీపీ, జనసేన దగాకోరు పార్టీలని డొక్కామాణిక్యవరప్రసాద్ దుయ్యబట్టారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page