అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై టిడిపి నాయకురాలు దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి తాను ఓ ఐటమ్ సాంగ్ ని అని గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందిస్తూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు దివ్యవాణి

''రోజా నువ్వు అడుగు పెట్టగానే సినిమా కి ఎండ్ కార్డ్ పడింది మర్చిపోయావా?''జైల్లో జగ్గూ''అనే సీరియల్ 16 నెలలు సాగింది,ఇప్పటికీ ప్రతీ శుక్రవారం వస్తుంది చూడటం లేదా?16 ఏళ్ళ పాటు జైలుకి రావాలి జగన్,కావాలి జగన్ అనే పాట కంపోసింగ్ లో ఉంది'' అంటూ ట్విట్టర్ వేదికన సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. 

read more  అచ్చెన్నాయుడిని కలిసే ప్రయత్నం... వర్ల రామయ్య హౌస్ అరెస్ట్

''జగన్ రెడ్డి అవినీతి చిట్టా సీబీఐ బయటపెట్టింది దానికి సమాధానం నువ్వు చెబుతావా రోజా?వైకాపా లో నువ్వు ఐటమ్ సాంగ్ మాత్రమే అని గుర్తెరిగితే మంచిది రోజా రెడ్డి''అంటూ రోజాపై విరుచుకుపడ్డారు. 

''కూల్చివేతలు,కక్ష తీర్చుకోవడం తప్ప ఏడాదిలో జగన్ రెడ్డి సాధించింది ఏంటో చెప్పే ధైర్యం ఉందా రోజా రెడ్డి గారు.ఒక బీసీ నేతలు అరెస్ట్ చేసా అన్న సైకో ఆనందం తప్ప ఒక్క ఆధారమైనా చూపించగలిగారా?'' అంటూ వరుస ట్వీట్లతో రోజా, జగన్ లపై మండిపడ్డారు దివ్యవాణి.