టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్‌కు నిరసనగా ధర్నా చేసేందుకు చింతమనేని ఆయన అనుచరులు ప్రయత్నించారు.

Also Read:ట్రైలర్ మాత్రమే, అసలు ముందుంది: అచ్చెన్న అరెస్టుపై రోజా

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, చింతమనేని ప్రభాకర్ అనుచరులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

అనంతరం పోలీసులు చింతమనేనిని, ఆయన అనుచరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also Read:అన్ని బయటకొస్తే.. అచ్చెన్నాయుడే కాదు బాబు, లోకేశ్‌లూ ఊచలు లెక్కెట్టాల్సిందే: జోగి రమేశ్

కాగా ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని శుక్రవారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.