అవినీతి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్పేంటని టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే జోగీ రమేశ్. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రూ.150 కోట్లు తినేసిన వ్యక్తినే పోలీసులు అరెస్ట్ చేశారని జోగి రమేశ్ చెప్పారు.

Also Read:గేట్లు దూకి ఇంట్లోకి వచ్చారు, ఆరోగ్యం బాగాలేదు: అచ్చెన్నాయుడు భార్య మాధవి

ఆ సొమ్మంతా కార్మికుల కష్టార్జితమన్న ఆయన.. వారి జీతంలో నుంచి కొంత ఈఎస్ఐ కోసం దాచుకున్నారని, ఇలాంటి సొమ్మును అడ్డంగా దోచేశారని రమేశ్ ఆరోపించారు. బలహీన వర్గాల వ్యక్తయితే దోచేస్తారా...? ఆ వర్గాల్లో పుడితే దోచేయమని ఏమైనా రాజ్యాంగంలో వుందా అని జోగి రమేశ్ ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు వెనుక ఉన్న వారందరినీ బయటకు తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. నేరం రుజవయితే అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబు, లోకేశ్‌లు కూడా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని జోగి రమేశ్ వ్యాఖ్యానించారు.

Also Read:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్: ఈఎస్ఐ స్కామ్ ఏమిటి?

బలహీన వర్గాల ప్రజలంతా బలంగా, శక్తివంతంగా ఉన్నారని ఆయన తెలిపారు. అరెస్ట్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వడానికి అచ్చెన్నాయుడు ఏమైనా స్వతంత్ర సమరయోధుడా..? అని జోగి రమేశ్ ప్రశ్నించారు.