టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాణాలకు ప్రమాదం వుందంటూ ఓ వ్యక్తి పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది. బుచ్చయ్యపేటకు చెందిన ఓ వ్యక్తి ‘ మిమ్మిల్ని చంపేందుకు ప్లాన్ జరుగుతోందని.. మీ ప్రాణాలు ప్రమాదంలో వున్నాయంటూ’ నేరుగా అయ్యన్నపాత్రుడికి మేసేజ్ పెట్టాడు.

ఆయనతో పాటు మరో ఆరుగురు నేతలకు ప్రాణహానీ పొంచి వుందని హెచ్చరించాడు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరాడు.

దీనిపై ఆందోళనకు గురైన అయ్యన్నపాత్రుడు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడు వియ్యపు తాతారావును అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.