ఒక ఫ్యాను మరో లైట్... కరెంట్ బిల్లు మాత్రం రూ.41వేలు: అమర్ నాథ్ రెడ్డి

కరోనా కష్ట సమయంలో ప్రజలకు అండగా వుండాల్సిన ప్రభుత్వమే వారిపై అధిక కరెంట్ బిల్లుల భారాన్ని మోపుతోందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు.  

TDP Leader Amarnath Reddy reacts power charges hike in AP

గుంటూరు: కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్ధికంగా చితికిపోయిన పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజలను అందుకొవాల్సింది పోయి ప్రజలపై కరెంట్ చార్జీలంటూ  భారం మోపే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు అంటూ ఆనాటి టిడిపి ప్రభుత్వాన్ని  విమర్శించారని... కానీ ఇప్పుడు గత ప్రభుత్వం కంటే మూడింతలు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 

''రాష్ట్రంలో కరెంట్ కొరత లేదు...అయినప్పటికి కరెంట్ చార్జీలు శ్లాబుల్ పేరుతో ఎందుకు పెంచారు. రూ.90వేల కోట్లకు డిస్కమ్ లకు కరెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేసింది. కనీసం ఈ మూడు నెలలైనా కరెంట్ బిల్లు రద్దు చేయాలి. మా పలమనేరు నియోజకవర్గంలో ఒక ఇంటిలో ఫ్యాన్, లైట్ మాత్రమే ఉంటే రూ.41వేల కరెంట్ బిల్లు వచ్చిందని...ఇది ఎలా వచ్చింది'' అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 

read more  లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులన్నీ రద్దు...: మాజీమంత్రుల డిమాండ్

''రూ.200, రూ.300 వచ్చే కరెంట్ బిల్లు ఇలాంటి సమయంలో వేలకు వేలు వస్తే సామాన్య ప్రజలు ఏవిధంగా కడతారని మండిపడ్డారు. కరోనా సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేయవద్దంటే ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి లేదన్నారు.  బ్రాండ్ లేని మద్యం తీసుకువచ్చి ప్రజా ఆరోగ్యంతో అడుకుంటున్నారు'' అని మంత్రి విమర్శించారు.

''వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై రూ.50వేల కోట్లు భారం మోపారు.  దానిని మాఫీ చేయడం కోసం ప్రభుత్వం భూములను అమ్మటానికి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి జీవోపై కోర్టు మొట్టికాయలు వేసినా ఆ పార్టీ నాయకులకు, ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. గతంలో చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల వలనే రాష్ట్రానికి కరెంట్ ఇబ్బందులు లేవు'' అని వెల్లడించారు. 

 పాత శ్లాబులను ప్రభుత్వ కొనసాగించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. మాస్కులు లేవని చెప్పినందుకు సస్పెండ్ చేసి చేతులు కట్టేసి ఒక దేశ దోహ్రిని కొడుతూ  దళిత డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు చాలా దారుణం వ్యవహరించారు. అలాగే పాలీమర్స్ కంపెనీ సంఘటన పై సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టినందుకు రంగనాయకమ్మ కేసులు పెట్టడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలకు భవిష్యత్ లో ప్రజలు బుద్ది చెబుతున్నారని అన్నారు. 

వేరుశనగ విత్తనాల పంపీణిలో గంగదరగోళం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సంవత్సరం పండుగ చేసుకునే ముందు ప్రజలపై వేసిన భారం తగ్గించి చేసుకోవాలని అమర్ నాథ్ రెడ్డి సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios