ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈసీ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

తెలుగుదేశం పార్టీ తరపున ఎస్ఈసీని కలిసి వాస్తవాలు వివరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారన్న ఆయన ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఖరి మారాలని సూచించారు.

Aslo Read:వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

ఎన్నికల కోడ్ సడలించడాన్ని కూడా తాము స్వాగతిస్తున్నామన్నారు. ఎస్ఈసీకి కులాన్ని ఆపాదించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎవరికి కులం ఆపాదిస్తారని నిలదీశారు.

కరోనా వైరస్ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీఎంను డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కరోనా వైరస్ నియంత్రణపై దృష్టి పెట్టాలని.. దేశం మొత్తం  కరోనా వైరస్ గురించి భయపడుతుంటే ముఖ్యమంత్రికి పట్టడం లేదా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.

Also Read:లండన్ నుంచి కూతుర్లు వెనక్కి: జగన్ పారాసిటమాల్ వ్యాఖ్యలపై సెటైర్లు

మరో నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ముఖ్యమంత్రి అవగాహనారహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది కరోనా బారినపడ్డారని, 8 వేలమంది చనిపోయారు.

బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్‌తో కరోనా వైరస్ సోకుతుందనడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి సమీక్ష చేయాలని, ప్రజలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు.