ప్రారంభమైన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ భేటీ:ఆరు అంశాలపై చర్చ

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం  ఇవాళ రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో రెండు పార్టీలకు చెందిన సమన్వయ కమిటీ సభ్యులు  12 మంది పాల్గొన్నారు.

TDP, janasena  coordination meeting  Begin in Rajahmundry lns

రాజమండ్రి: టీడీపీ , జనసేన సమన్వయ కమిటీ  తొలి సమావేశం  సోమవారం నాడు రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో  పాల్గొనేందుకు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ  మధ్యాహ్నం రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రిలోని ఓ హోటల్ లో  టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది.టీడీపీ, జనసేన సమన్వయకమిటీకి చెందిన  12 మంది సభ్యులు  ఈ సమావేశంలో  పాల్గొన్నారు. ఆరు అంశాలపై  ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, బూత్, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై  చర్చించనున్నారు.

 ఈ సమావేశం ప్రారంభానికి ముందే  పార్టీ సీనియర్లతో  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ తో జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై  లోకేష్  పార్టీ సీనియర్లతో చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి లోకేష్ ...పవన్ కళ్యాణ్ తో భేటీకి వెళ్లారు. 

TDP, janasena  coordination meeting  Begin in Rajahmundry lns

 టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.వచ్చే ఎన్నికల్లో  టీడీపీ, జనసేన కలిసి  పోటీ చేయనున్నాయి. జగన్ సర్కార్ అవలంభించే  విధానాలపై పోరాట కార్యక్రమాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.రానున్న రోజుల్లో ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలనే విషయమై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

also read:పార్టీ సీనియర్లతో లోకేష్ భేటీ: టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో అంశాలపై చర్చ

సమావేశం ప్రారంభంలో  టీడీపీ నేతలను  పవన్ కళ్యాణ్ కు  లోకేష్ పరిచయం చేశారు.సమన్వయ కమిటీలోని  జనసేన నేతలను  లోకేష్ పేరు పేరున లోకేష్ పలకరించారు. వివిధ సమస్యలపై  ఉద్యమ కార్యాచరణను  రూపొందించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ  ఈ సమావేశం తీర్మానం చేయనుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని  సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

పొత్తులో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా  సమన్వయ కమిటీలకు బాధ్యతలు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు పార్టీల నేతలు సమన్వయం చేసుకొనేలా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విడివిడిగా, ఉమ్మడిగా ఉద్యమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సమస్యలు, కరువుపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై  రెండు పార్టీల నేతలు మీడియాకు వివరించే అవకాశం ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios