పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు.


రాజమండ్రి: పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సోమవారం నాడు  రాజమండ్రిలో సమావేశమయ్యారు.జనసేన  చీఫ్ పవన్ కళ్యాణ్ తో నిర్వహించే సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై  చర్చిస్తున్నారు.ఈ సమావేశంలో  టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు  యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు  యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమావేశం  ఇవాళ  జరగనుంది.భవిష్యత్తులో  రాష్ట్రంలో అమలు చేయాల్సిన  వ్యూహంపై  రెండు పార్టీల నేతలు చర్చించనున్నారు. వచ్చే ఎన్నికల్లో  టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి.  ఈ మేరకు  రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబు జైల్లో ఉన్నందన  పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ. 13 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

టీడీపీ, జనసేన నేతల సంయుక్త సమావేశం ఇవాళ మధ్యాహ్నం  జరగనుంది.వైఎస్ జగన్  ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  పోరాటాలతో పాటు ఇతర అంశాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.  

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని  ఏపీ సీఐడీ అధికారులు  ఈ ఏడాది  సెప్టెంబర్ 9వ తేదీన  అరెస్ట్ చేశారు.  చంద్రబాబును  రాజమండ్రి జైలులో పరామర్శించిన తర్వాత  టీడీపీతో  కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని  పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెండు పార్టీలు క్షేత్రస్థాయి నుండి  సమన్వయంతో  పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన తర్వాత  తొలిసారిగా   ఈ రెండు పార్టీల నేతలు  ఇవాళ సమావేశమౌతున్నారు.  ఈ సమావేశం కోసం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజమండ్రికి  చేరుకున్నారు.