Asianet News TeluguAsianet News Telugu

లంచం ఇవ్వాల్సిందే: రెవిన్యూ సిబ్బంది లంచం అడిగారని ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో

సర్టిఫికెట్ల కోసం రెవిన్యూ సిబ్బంది లంచం అడిగారని  ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

 Army Jawan releases  video of bribery by Kondurgu Tehsildar office staff lns
Author
First Published Mar 9, 2024, 7:03 AM IST

షాద్ నగర్:  దేశరక్షణ కోసం పనిచేస్తున్న సైనికుడిని లంచావతారాలు వదల్లేదు.  పని కావాలంటే చేతులు తడపాల్సిందేనని  తహసీల్దార్ కార్యాలయంలో  అధికారులు తేల్చి చెప్పారు.  ఈ విషయాన్ని  ఆ సైనికుడు ఓ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  దరిమిలా విషయం వెలుగు చూసింది.

also read:అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామానికి చెందిన  ఆశోక్ రెడ్డి కాశ్మీర్ సరిహద్దులో  పనిచేస్తున్నాడు. సెలవుపై ఆశోక్ రెడ్డి  స్వగ్రామానికి వచ్చాడు.  తన గ్రామంలో ఉన్న  పొలానికి సంబంధించి ఆర్ఓఆర్, పహాణీల కోసం ధరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పని కావాలంటే రూ. 40 వేలను రెవిన్యూ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది లంచం అడిగారని  ఆశోక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సెల్ఫీ వీడియోలో ఆరోపించారు.  తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కొందరు సిబ్బంది రూ. 40 వేలు అడిగారని ఆయన పేర్కొన్నారు.

also read:గాల్లోనే ఊడిన విమానం టైర్: పైలెట్ ఏం చేశాడంటే?

 

దేశ రక్షణ కోసం తాను సరిహద్దుల్లో పనిచేస్తున్నానని తాను చెప్పినా కూడ లంచం ఇవ్వాల్సిందేనని  తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది చెప్పారన్నారు.  తమతో పాటు పై అధికారులకు కూడ లంచంలో వాటా ఉంటుందని  చెప్పారని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.

also read:రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్: శుభాకాంక్షలు తెలిపిన మోడీ

అయితే  తన పనిని పూర్తి చేసుకోవడం కోసం రూ. 30 వేలు చెల్లించినట్టుగా ఆశోక్ రెడ్డి చెప్పారు.  ఈ డబ్బులు చెల్లించిన తర్వాతే తనకు సర్టిఫికెట్లు అందించారని ఆ సెల్ఫీ వీడియోలో ఆశోక్ రెడ్డి  ఆరోపించారు.

also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?

 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై విచారణ జరిపి చర్యలు తీసుకొంటామని  తహసీల్దార్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios