చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమం 57 నియోజకవర్గాల్లో టిడిపి వెనకబడింది. పార్టీ అధిష్టానం జరుపుతున్న రోజువారీ పర్యవేక్షణలో ఈ విషయం బయటపడింది. దాంతో పార్టీ ముఖ్యులు బుధవారం 57 నియోజకవర్గాల బాధ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమం సక్రమంగా జరగకపోవటానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం సరిగా జరగకపోతే రానున్న ఎన్నికల్లో బాధ్యులకు జరగబోయే నష్టం విషయంలో క్లాసు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతున్న విధానంపై చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల నుండి రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. దాన్ని ఇతర మార్గాల్లో కూడా విశ్లేషించుకుంటున్నారు. కార్యక్రమంలో భాగంగా జనాల అవసరాలపై సర్వే కూడా చేయిస్తున్నారు. దాని ఆధారంగా సంక్షేమపథకాల రూపకల్పనకు చంద్రబాబు ప్రణాళికలు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టో తయారీకి ఈ కార్యక్రమమే ఆధారంగా చెప్పుకుంటున్నారు. అందుకనే కార్యక్రమం సక్రమంగా జరగని 57 నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిని పెట్టారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళు తదితరాల మంజూరుపై నేతలు దృష్టిపెడుతున్నారు.

గడచిన ఐదు రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో ఇళ్ళు, పింఛన్లు, రేషన్ కార్డుల లాంటి వ్యక్తిగత అవసరాల కోసమే మెజారిటీ జనాలు ఎదురుచూస్తున్నారన్న విషయం రిపోర్టుల్లో స్పష్టమైనట్లు చంద్రబాబు గుర్తించారు. అందుకనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. వ్యక్తిగత అవసరాలను గమనించుకుంటే, సామాజిక అవసరాలపై తర్వాత దృష్టి పెట్టవచ్చన్నది చంద్రబాబుకు అందుతున్న ఫీడ్ బ్యాక్ అట. కార్యక్రమం పూర్తయిన తర్వాత చంద్రబాబు ఏం నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.