నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలుగుదేశంపార్టీ, వైసీపీ ఎంఎల్ఏలకు గాలమేస్తున్నట్లే ఉంది. వైసీపీకి చెందిన 10 మంది ఎంఎల్ఏలు హైదరాబాద్ లోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని చంద్రబాబు ఫిరాయింపు ఎంఎల్ఏకి టిక్కెట్టు ఇవ్వగలరా? డబ్బు కోసమే కక్కుర్తిపడితే రాజకీయ భవిష్యత్తు మొత్తం దెబ్బతినేస్తుందన్న విషయం ఎంఎల్ఏలకు తెలీదా? వైసీపీలోనే కొనసాగితే సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో తిరిగి టిక్కెట్టు దక్కే అవకాశాలైనా ఉంటాయ్.
నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలుగుదేశంపార్టీ, వైసీపీ ఎంఎల్ఏలకు గాలమేస్తున్నట్లే ఉంది. వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ ఫినిష్ అంటూ మంత్రులు, నేతలు చేస్తున్న ప్రకటనలను బట్టి టిడిపి పెద్ద వ్యూహమేదో సిద్ధం చేస్తున్నట్లే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుంకటే, ఫలితం వచ్చిన దగ్గర నుండి కూడా మంత్రులు మాట్లాడుతూ, వైసీపీ నుండి పలువురు ఎంఎల్ఏలు తమ పార్టీలోకి వచ్చేయటానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటనలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.
చంద్రబాబునాయుడు అనుమతి లేనిదే మంత్రులు అటువంటి ప్రకటనలు చేయటానికి సాహసం చేయగలరా? చేస్తున్నారంటే ప్రకటనల వెనుక ఏదో పెద్ద వ్యూహం సిద్ధమవుతోందని అర్ధం చేసుకోవాలి. ఇందులో భాగమే రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది. వైసీపీకి చెందిన 10 మంది ఎంఎల్ఏలు హైదరాబాద్ లోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారని ప్రచారం ప్రారంభమైంది. పైగా సమావేశమైన ఎంఎల్ఏల పేర్లు కూడా ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత నిజముందో తెలీదు గానీ సోషల్ మీడియా వేదికగా వారిపై మైండ్ గేమ్ మొదలైనట్లే కనబడుతోంది.
అయితే, ఇక్కడే ఓ విషయం టిడిపి నేతలకు అడ్డు వస్తోంది. అదేంటంటే సాధారణ ఎన్నికలకు మిగిలింది ఏడాదిన్నరే. ఈ సమయంలో ఎవరైనా వైసీపీ నుండి టిడిపిలోకి ఎందుకు వస్తారు? ఒకవేళ వచ్చినా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన నేతలను కాదని చంద్రబాబు ఫిరాయింపు ఎంఎల్ఏకి టిక్కెట్టు ఇవ్వగలరా? టిక్కెట్టు ఇవ్వటం సాధ్యం కాకపోతే మహా అయితే నాలుగు డబ్బులు సంపాదించుకునే అవకాశాలు మాత్రమే ఉంటాయి. డబ్బు కోసమే కక్కుర్తిపడితే రాజకీయ భవిష్యత్తు మొత్తం దెబ్బతినేస్తుందన్న విషయం ఎంఎల్ఏలకు తెలీదా?
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాలు పెరగటం లేదన్న విషయం తేలిపోయింది. వైసీపీలోనే కొనసాగితే సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో తిరిగి టిక్కెట్టు దక్కే అవకాశాలైనా ఉంటాయ్. సరే, ఇపుడేదో నంద్యాలలో ఓడిపోయిందనో లేకపోతే కాకినాడలో దెబ్బతిన్నదనో వైసీపీని తక్కువంచనా వేసేందుకు లేదు. ఏదో ప్రత్యేక పరిస్ధితిల్లో జరిగిన ఎన్నికలు కాబట్టి రెండింటిలోనూ టిడిపి గెలవచ్చు. ఇదే ఫలితం వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా రిపీటవుతుందని గ్యారింటీ లేదు. కాబట్టి, సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నరుండగా నంద్యాల, కాకినాడ ఎన్నికలు జరగటం ఒకవిధంగా జగన్ కు మంచిదే అయింది. ఎందుకంటే, టిక్కెట్టు వస్తుందన్న గ్యారెంటీ లేకుండా వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించే వారెవరూ పెద్దగా ఉండకపోవచ్చు.
