ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.
తన సవాల్ ను స్వీకరించాలని ఆయన జగన్ ను కోరారు. జగన్ కు దమ్ముంటే సింహాచలం అలయానికి రావాలని ఆయన కోరారు.జగన్ పార్టీ ఫేక్.. హామీలన్నీ ఫేక్..పాలన కూడా ఫేక్ అని ఆయన విమర్శించారు. తనపై వైసీపీ చేసిన ఆరోపణలన్నీ పింక్ డైమండ్ విషయంలోనే తేలిపోయిందని ఆయన చెప్పారు.
ఏ1 క్రిమినల్ సీఎం..తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు. నీ బతుకు ఫేక్. నీ పార్టీ ఫేక్. నీ హామీలు ఫేక్. నీ పాలన ఫేక్. చివరికి నాపై నీ దొంగల బ్యాచీతో చేయించే ఆరోపణలూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. (1/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021
ఎన్నాళ్లీ దొంగలతో దొంగ ఆరోపణలు జగన్ రెడ్డీ! సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం.నువ్వు సిద్ధమా?@ysjagan (2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021
విజయసాయిరెడ్డితో తనపై దొంగ ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శలు గుప్్పించారు.
విజయనగరం జిల్లాలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంలో చంద్రబాబు, లోకేష్ ల పాత్ర ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.ఈ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ట్విట్టర్ వేదికగా లోకేష్ ఈ సవాల్ విసిరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 1, 2021, 3:02 PM IST