హైదరాబాద్: 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందన్న వ్యాఖ్యలతో తాను ఏకీ భవించనన్నారు మాజీఎంపీ సినీనటుడు మురళీమోహన్. 

పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి కాస్త ప్లస్ అయ్యిందేమో గానీ ఆయనవల్లే అధికారంలోకి వచ్చామన్నది సరికాదన్నారు. 2014 ఎన్నికల కంటే ముందు జరిగిన ఎన్నికల్లో అనేక సార్లు తెలుగుదేశం పార్టీ ఒంటిరిగానే పోటీ చేసి గెలుపొందిన దాఖలాలు అనేకం ఉన్నాయన్నారు. 

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం అనేది మంచి పరిణామమే కానీ ఆయన అండదండలతోనే అధికారంలోకి వచ్చామన్న అభిప్రాయంతో తాను ఏకీభవించబోనన్నారు. 

అయితే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం పెట్టుకోవడం వల్ల లాభం ఎలా ఉన్నా తీవ్రంగా నష్టపోయామన్నారు. కేంద్రంతో ఘర్షణ పెట్టుకోవడం తమకు మైనస్ అయ్యిందని అలాగే పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం కూడా పార్టీకి నష్టం చేకూరిందన్నారు. 

సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఏ సినీనటుడుకి ఉందని వేసిన ప్రశ్నకు మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అలాంటి ఆలోచన చేయలేదన్నారు. పోనీ భవిష్యత్ లో ఎవరికి అవకాశం ఉందని భావిస్తున్నారని అంటే భవిష్యత్ గురించి ఏం చెప్పలేం అంటూ దాటవేశారు. ఆ సమయంలో ప్రజా నిర్ణయాన్ని బట్టి అవకాశం ఉంటే ఉండొచ్చన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మురళీమోహన్ దూరం: రాజమండ్రి టీడీపీ అభ్యర్థి బొడ్డు

విశాఖలో వచ్చేనెల 3న పవన్ కళ్యాణ్ ర్యాలీ: జనసేన నిర్ణయాలివే