టీడీపీ మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు.  గతంలో ఆయన గద్వాల్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

కాగా... గత కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. నేటి ఉదయం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.  ఆయన అభిమానులు, కార్యకర్తలు కడసారి చూపు కోసం ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు