బాలకృష్ణ ఇలాకలో టీడీపీకి షాక్

tdp ex mla abdhul ghani may leaves the party
Highlights

వైసీపీ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే

సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో టీడీపీకి ఊహించని షాక్ తగలనుందా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడి వైసీపీలో చేరే అవకాశాలు కనపడుతున్నాయి. దీనంతటికీ బాలకృష్ణ ముఖ్య కారణం కావడం గమనార్హం.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. హిందూపురం సీటు టీడీపీకి  అనుకూలంగానే ఉంది. 2009 ఎన్నికల్లో అబ్దుల్ గని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికలకు వచ్చేసరికి బాలకృష్ణ కోసం ఘని తన సీటును త్యాగం చేశారు. అయితే..  సీటు త్యాగం చేసినందుకు గాను ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు.

కానీ.. ఆ హామీ ని నెరవేర్చడంలో విఫలం అయ్యారు. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకే ఆ నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేయకపోయి ఉంటే అబ్దుల్‌ ఘని రెండోసారి ఎమ్మెల్యే అయ్యేవారు.. అదృష్టం కలిసివస్తే మంత్రి పదవి కూడా దక్కేది.. ఎందుకంటే టీడీపీ తరఫున ఆ ఎన్నికల్లో ఒక్క మైనారిటీ కూడా గెలవలేద కాబట్టి! మైనారిటీ కోటాలో ఘని మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

అటు ఎమ్మెల్యే పదవీ దక్కక.. ఇటు ఇస్తానన్న నామినేటెడ్ పదవీ కూడా దక్కకపోవడంతో ఘనిలో అసంతృప్తి బాగా పెరిగిపోయింది. దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇదే అవకాశంగా మలుచుకున్న వైసీపీ అతనికి గాలం వేసే పనిలో పడింది. త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే.. ఘని ఇప్పటి వరకు మాత్రం పార్టీ మారే ఆలోచనలో లేననే చెబుతున్నారు. నిజంగా పార్టీ మారతారో లేదో వేచి చూడాలి. 

loader