జెసి బ్రదర్స్ నుంచి ప్రాణహాని, చంద్రబాబే అప్పట్లో లేఖ రాశారు

First Published 3, Jul 2018, 11:58 AM IST
TDP dissident leaders accuse JC brothers
Highlights

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిపై తెలుగుదేశం అసమ్మతి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

తాడిపత్రి: తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిపై తెలుగుదేశం అసమ్మతి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. జెసి బ్రదర్స్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జగదీశ్వర్ రెడ్డి, జయచంద్రా రెడ్డి అన్నారు. 

తమకు ఏ హాని జరిగినా అందుకు కారణం జెసి బ్రదర్స్, వారి కుమారులేనని వారు మంగళవారం మీడియాతో అన్నారు. జెసి కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అప్పట్లో చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రిని కోరిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

తాడిపత్రిలో జెసి బ్రదర్స్ రూ.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఆ విషయాన్ని ఎక్కడైనా నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. తాడిపత్రిలో అక్రమాలు, దౌర్యన్యాలు బాహాటంగా జరుగుతున్న ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యల వల్ల టీడీపి ప్రతిష్ట దెబ్బ తింటోందని అన్నారు. 

loader