అమరావతి:ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై జరిగిన అన్యాయంపై మంగళవారంనాడు  రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహిస్తున్న  అఖిలపక్షం, మేథావులు సమావేశానికి హాజరుకావాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

విభజన హామీలు, ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకపోవడంపై ఉండవల్లి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరుకావాలని  ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్ని పార్టీలకు లేఖలు రాశారు.ఈ లేఖపై బాబు స్పందించారు.  

తమ పార్టీ తరపున  ఈ సమావేశానికి హాజరుకావాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. సమావేశానికి ఎంపీ సీఎం రమేష్‌, మంత్రి ఆనందబాబును పంపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.అయితే టీడీపీతో కలిసి వేదికను పంచుకోలేమని, ఈ భేటీకి తాము రామని వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు.