ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ను టీడీపీ నేతల బృందం గురువారం కలిసింది. ఈ నెల 13న జరగనున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను చేరుస్తోందంటూ ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది
ఈ నెల 13న జరగనున్న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను చేరుస్తోందంటూ ప్రతిపక్ష టీడీపీ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. బోగస్ ఓట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బోగస్ ఓట్లతో వైసీపీ కుట్రలు చేస్తోందని.. దీనిని ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
కాగా.. ఎమ్మెల్యే కోటాలో పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణఫ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు వీరందరికీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బీ ఫాంలు ఇచ్చారు. అనంతరం వీరంతా అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
Also REad: సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు .. జగన్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసలు
మరోవైపు..టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.
