సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చూపుతున్నారని ప్రశంసించారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలను వెనుబడిన వర్గాలకు కేటాయించామని సజ్జల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం జరుగుతోందన్నారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో భాగంగా వైసీపీ అభ్యర్ధులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు సీఎంగా వున్నప్పుడు బీసీలకు ఎందుకు అవకాశాలు కల్పించలేదని సజ్జల ప్రశ్నించారు. జగన్ మూడున్నరేళ్లలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని.. సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారని ఆయన ప్రశంసించారు. 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలను వెనుబడిన వర్గాలకు కేటాయించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
కాగా.. ఎమ్మెల్యే కోటాలో పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణఫ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు వీరందరికీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బీ ఫాంలు ఇచ్చారు. అనంతరం వీరంతా అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
Also REad: ఏపీలో మందుబాబులకు షాక్.. ఆ మూడు జిల్లాల్లో 3 రోజుల పాటు మద్యం షాపులు బంద్
మరోవైపు..టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో 9 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో 5 అధికార వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. దీంతో మరో 4 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16న ఓట్లు లెక్కించి.. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు.
