అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన ప్రకటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు అదిరిపోయే సూచన చేశారు. అక్రమ కేసులు పెడితే మౌనంగా ఉండవద్దని ఆయన సూచించారు. పోలీసులు ఒక కేసు పెడితే రెండు ప్రైవేట్ కేసులు పెట్టాలని ఆయన టీడీపీ కార్యకర్తలకు చెప్పారు 

పోలీసులు నేరుగా ఫిర్యాదులు తీసుకోకపోతే ఆన్ లైన్ లో రిజిష్టర్ చేయాలని చెప్పారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలనే డీజీపీ మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. 

పోలీసులు కాళ్లబేరానికి రావాలంటే ప్రైవేట్ కేసులు పెట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు తప్పుడు కేసులకు కాలం చెల్లిందని ఆయన అన్ారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని డిజీపీ ఊదరగొడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

డీజీపీ సూచనను టీడీపీ శ్రేణులు వినియోగించుకోవాలని ఆయన అన్ారు. ఫిర్యాదులు స్వీకరించని పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.