Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారులపై చర్యలకు డిమాండ్

రాష్ట్రంలోని పలు చోట్ల  చోటు చేసుకొన్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశాడు.

TDP chief chandrababunaidu writes letter to AP SEC lns
Author
Guntur, First Published Feb 8, 2021, 7:16 PM IST

అమరావతి:రాష్ట్రంలోని పలు చోట్ల  చోటు చేసుకొన్న అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశాడు.పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో వైఎస్ఆర్‌సీపీ అక్రమాలకు పాల్పడిందని  ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.

గ్రామ స్వరాజ్యం సాధించుకోడానికి క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలే ఒక సాధనంగా ఆయన పేర్కొన్నారు.కానీ, వైకాపా బౌతిక దాడులు, హింస తో ప్రజలు ఎన్నికల హక్కులను వినియోగించుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు.

ఒకవైపు అభ్యర్ధులపై వైసీపీ దాడులు చేస్తుంటే మరోవైపు నామినేషన్లు వేయకూడదంటూ ఒకవర్గం పోలీసులు కుమ్మక్కై అభ్యర్ధులను బెదిరిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాలలో టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపా అడ్డుకుంటోందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

పుంగనూరు మండల ఎస్సై ఉమామహేశ్వర్ రావు, ఎంపిడిఓ లక్ష్మీకాంత్ లు ప్రతిపక్ష అభ్యర్ధులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో ఎస్ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.చౌడేపల్లి ఎస్.ఐ మధుసూధన్ రెడ్డి పత్రిపక్ష అభ్యర్ధులపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు.

సోమల మండలం ఎస్సై లక్ష్మీకాంత్ 2020 మార్చిలోనే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరించారు. నాడు ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకురావడం జరిగిందన్నారు.

సదుం ఎస్సై పి. ధరణిధర్, పులిచర్ల మండలం, కొల్లూరు ఎస్సై శ్రీనివాసులు అభ్యర్ధులను నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారన్నారు.పోలీసు అధికారుల చర్యలతో ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్ధులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోతున్నారని చెప్పారు.

పుంగనూరుకు సంబంధించి పుంగనూరు ఎస్సై ఉమామహేశ్వర్ రావు, చౌడేపల్లి రూరల్ ఎస్సై మధుసూధన్ రెడ్డి, సోమల ఎస్సై లక్ష్మీకాంత్, సదుం ఎస్సై ధరణిధర్, కొల్లూరు ఎస్సై శ్రీనివాసులు పై ఎన్నికల సంఘానికి ఆ లేఖలో  చంద్రబాబు ఫిర్యాదు చేశారు.

మాచర్లకు సంబంధించి మాచర్ల రూరల్ ఎస్సై బత్తవత్సల రెడ్డి, దుర్గి ఎస్సై ఎం. రామాంజనేయులు, వెల్దుర్తి ఎస్సై సుధీర్, కారెంపూడి ఎస్సై రవికృష్ణ, రెంటచింతల ఎస్సై చల్లా సురేష్, మాచర్ల ఎస్సై ఉదయలక్ష్మి, నాగార్జున సాగర్ ఎస్సై పాల్ రవీందర్ లపై పిర్యాదు. చేశారు.

మాచర్ల, పుంగనూరులలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ లేఖలో చంద్రబాబు. కోరారు.మాచర్ల, పుంగనూరులలో పనిచేస్తున్న ఎం.ఆర్.ఓలను, ఎం.పీ.డీ.ఓలను, పోలీసు అధికారులను అక్కడ నుండి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. పోటీ చేయాలనుకునే అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని ఆయన  ఆ లేఖలో కోరారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios