తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్‌తో పాటు పలువురు టీడీపీ నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.

దీనిలో భాగంగా ఈ కేసుతో సంబంధం లేనివారిని ప్రశ్నిస్తున్నారంటూ సీఐ కార్యాలయం వద్ద చంద్రబాబు పీఏ మనోహర్‌ సహా పలువురు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో మనోహర్‌తో పాటు మరో 19 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది,