Asianet News TeluguAsianet News Telugu

స్థానిక ఎన్నికల్లో నిరాశ: ఈ నెల 12 నుండి కుప్పంలో బాబు టూర్


 ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు.  కుప్పం నియోజకవర్గంలో బాబు టూర్ ప్రాధాన్యత నెలకొంది.

TDP Chief Chandrababu naidu to visit  Kuppam from october 12
Author
Kuppam, First Published Oct 10, 2021, 4:49 PM IST

చిత్తూరు: తన స్వంత నియోజకవర్గం kuppam assembly నియోజకవర్గంలో ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు tdp చీఫ్ చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఎన్నికలకు టీడీపీ  దూరంగా ఉంది. అయినా కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేసినా ఆ పార్టీకి ఆశించిన ఫలితం రాలేదు.  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ycp మెజారిటీ స్థానాలను దక్కించుకొంది. దీంతో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో chandrababu naidu టూర్  ప్రాధాన్యత సంతరించుకొంది.

also read:బాబును జనం నమ్మలేదు.. కుప్పంలోనే టీడీపీ బొల్తా పడింది: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు

మూడు రోజుల పాటు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ నెల 12న కుప్పంలో బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. అదే రోజున కుప్పం పట్టణంలో పర్యటిస్తారు. ఈ నెల 13న శాంతిపురం, రామకుప్పం మండలాల్లో చంద్రబాబు  పర్యటిస్తారు. ఈ నెల 14న చంద్రబాబునాయుడు కుప్పం రూరల్ మండలంలో పర్యటిస్తారు. అదే రోజు గుడుపల్లి మండలంలో పర్యటించనున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల నుండి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంపై వైసీపీ  కేంద్రీకరించింది. గత ఎన్నికల  సమయంలో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రతి రౌండ్‌లో సమీప వైసీపీ అభ్యర్ధిపై ముందంజలో నిలిచారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కుప్పం అసెంబ్లీ స్థానంలో కూడ ఆధిపత్యం సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఏపీ మంత్రి peddireddy ramachandra reddy కేంద్రీకరించి పనిచేస్తున్నారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios