తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలతో నిస్సహాయ స్థితిలో ఉన్న చంద్రబాబుకు జగన్ వ్యాఖ్యలు ఏ మాత్రం మింగుడు పడటం లేదు.

ఈ క్రమంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలపై చంద్రబాబు నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. వైసీపీ, బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలను టీడీపీ అధినేత ఒక కంట కనిపెడుతున్నారు. జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనతో ఎవరెవరు టచ్‌లో ఉన్నారన్న దానిపై చంద్రబాబు తన సొంత టీమ్‌తో ఎంక్వైరీ చేయిస్తున్నారు.