కొందరు మీడియా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడటంతో ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు  నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగించే అంశమని ఆయన విచారం వ్యక్తం చేశారు.

విపత్కర పరిస్ధితుల్లో విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులు, వారి కుటుంబసభ్యులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. వైరస్ నివారణకు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని ట్వీట్ చేశారు. విధులు ముగిసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు మొబైల్ ఫోన్లను శానిటైజ్ చేయాలని చంద్రబాబు కోరారు.

కెమెరా రికార్డింగ్‌లు 6 అడుగుల దూరం నుంచే చేయాలని, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన వెంటనే తప్పనిసరిగా స్నానం చేయటంతో పాటు మైక్రోఫోన్లు, ఇతర పరికరాలను శుభ్రం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Also Read:జర్నలిస్టులకు కరోనా దెబ్బ: ముంబైలో 53 మందికి కరోనా

సాధ్యమైనంత వరకు ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. కాగా ముంబైలోని సుమారు 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. సుమారు 167 మంది జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే 53 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని స్థానిక మీడియా సంస్థ ప్రకటించింది.

ఇంకా మరికొందరి శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. వీటి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉందని అధికారులు ప్రకటించారు. ఈ నెల 16,17 తేదీల్లో  జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, మీడియా వాహనాల డ్రైవర్లు, మీడియా టెక్నీషీయన్లు సుమారు 170 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే వీరిలో 53 మమంది ఫలితాలు మాత్రమే వచ్చాయని ఆ మీడియా సంస్థ తెలిపింది.

కరోనా సోకిన జర్నలిస్టులకు ఎవరికి కూడ ఇప్పటివరకు కరోనా లక్షణాలు కూడ కన్పించకపోవడం గమనార్హం. కరోనా సోకిన జర్నలిస్టులను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read:కర్నూల్ లో కరోనా విజృంభణ... ఆ వైసిపి ఎమ్మెల్యే కారణంగానే...: అఖిలప్రియ సంచలనం

కరోనా సోకిన జర్నలిస్టులు ఇప్పటివరకు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నవారెవరో గుర్తించి వారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు.ఎక్కువగా టీవీ జర్నలిస్టులకు కరోనా సోకిందని సమాచారం.