ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేయి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన చేతికి కట్టుకట్టుకుని గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరయ్యారు.

దీంతో ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ప్రజలు తిరగబడితే రాష్ట్రంలో వైసీపీ నిలువదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

అధికారంలోకి వచ్చామనే గర్వంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తాము కూడ ఇలానే వ్యవహరిస్తే వైఎస్‌ఆర్‌సీపీ ఉండేదే కాదని  చంద్రబాబు గుర్తు చేశారు.

వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగని పరిస్థితి ఆ పార్టీకి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.బెదిరిస్తే భయపడిపోతామనే భావనలో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉన్నారన్నారు.అరాచకాలు కొనసాగిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతోందని చంద్రబాబు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు భేటీకి కేశినేని, గంటా సహా సీనియర్ల డుమ్మా, కారణం...?

పార్టీలో సమూల మార్పులకు చంద్రబాబు శ్రీకారం

ప్రజలు తిరగబడితే వైసీపీ నిలువదు: చంద్రబాబు

రాజీనామా చేస్తా: గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన ప్రకటన