విరిగిన విగ్రహాన్ని ఏ 2కి చూపించిన పోలీసులు... మేం అడిగితే మాత్రం అడ్డుకున్నారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. సాక్ష్యాలు తారుమారవుతాయని, ఎవరికీ చూపట్లేదని పోలీసులు అన్నారని... మరి ఏ 2 చూసేందుకు ఎందుకు అనుమతిచ్చారని బాబు ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి వెళ్తే సాక్ష్యాలు తారుమారు కావా అని ఆయన నిలదీశారు. పోలీసులకు బాధ్యతలే కాదు.. హద్దులూ ఉంటాయని, రూల్స్ పాటించని పోలీసులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

హిందువుల మతమార్పిడులు జరగడానికి కుట్రలు చేస్తున్నారని... సీఎంగా వుండి మత మార్పిడులకు పాల్పడటం తప్పని ఆయన హితవు పలికారు. సీఎం రోజూ బైబిల్ చదువుతా అన్నారని.. అలాగే మా దేవుళ్లపై మాకు నమ్మకం వుండదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Also Read:నిన్నా, మొన్నా గడ్డి పీకుతున్నావా: విజయసాయిరెడ్డిపై బాబు ఘాటు వ్యాఖ్యలు

హిందూ ఆలయాలు, విగ్రహాలు, భూముల జోలికి వెళ్తే ఖబద్ధార్ అని హెచ్చరించారు. జగన్‌కు మాత్రమే సెంటిమెంట్ ఉంటుందా..? జగన్ మెడలో, ఇంటిపై క్రాస్ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. రాముడు అడుగుపెట్టిన ఆనవాళ్లున్న ప్రదేశం రామతీర్ధమని ఆయన గుర్తుచేశారు.

400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం రామతీర్ధమన్నారు. ఇతర మతాలపై తనకూ గౌరవం వుందని... సీఎం ప్రాబల్యం కోసం హిందూయిజాన్ని బలిపెడతామంటే ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. తిరుమలకు వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇచ్చారా..? అని ఆయన ప్రశ్నించారు.