దేవుణ్ణి నమ్ముకునే వారందరూ బాధపడే పరిస్ధితి వచ్చిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం విజయనగరం జిల్లా రామతీర్ధం రామాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేవుణ్ణి నమ్ముకునే వారందరూ బాధపడే పరిస్ధితి వచ్చిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం విజయనగరం జిల్లా రామతీర్ధం రామాలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వ్యవస్థ ఇంత కుళ్లిపోయి.. భ్రష్టుపట్టిందంటే సీఎం ఏం ఫీల్ కావడం లేదా అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలకు నిప్పు పెట్టడం, పూజారులపై దాడులు చేస్తున్నారని.. ఇలాంటి సంఘటనలతో ఏ హిందువైనా బాధపడతాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ 22 ఏళ్ల పాలనలో కానీ, తన 14 ఏళ్ల హయాంలో కానీ ఎక్కడైనా ఒక మసీదు, చర్చి, ఆలయంపై దాడులు జరిగాయా అని చంద్రబాబు నిలదీశారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం కడుతున్నారని.. అలాంటిది ఉత్తరాంధ్ర అయోధ్యలో రామయ్య తల తీసుకెళ్లిపోయారని మండిపడ్డారు.
మంచి పాలన అంటే రామరాజ్యంతో పోలుస్తారని.. ఈ ముఖ్యమంత్రి మనిషి కాదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. శ్రీరాముడిని కాపాడలేకపోతే పదవిలో ఉండి ఉపయోగం ఏంటని ప్రతిపక్షనేత దుయ్యబట్టారు. కొంతమంది పోలీసులు బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని.. జనం తిరగబడితే పారిపోతారని ఆయన హెచ్చరించారు.
తాను దారిలో వస్తుంటే విన్యాసాలు చేస్తున్నారని.. తన ముందు తోక జాడిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2 వస్తే కాళ్లు మొక్కుతారా...? నిన్నా, మొన్నా విశాఖలో గడ్డిపీకుతున్నాడా ఏ2 అంటూ విజయసాయిరెడ్డిపై చంద్రబాబు ఫైరయ్యారు.
29న ఘటన జరిగితే 30, 31న రామతీర్థం ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. తాను వస్తుంటే పరిగెత్తుకొస్తారా..? నేను రాకపోతే ఇక్కడికి వచ్చేవాళ్లా అంటూ బాబు మండిపడ్డారు. ఇలాంటి చోటా, మోటా నాయకుల్ని చాలా మందిని చూశానని ఆయన ఎద్దేవా చేశారు. దేవుడికే తల తీసే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 2, 2021, 5:23 PM IST