స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లును ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్‌, భ్రమరావతి అంటూ అబద్ధాలు చెప్పారో వాళ్ల చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్‌ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడని పేర్కొన్నారు.

దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడంటూ ట్వీట్ చేస్తూ... ఈ సందర్భంగా ఏపీ సచివాలయానికి అమర్చిన విద్యుద్దీపాలంకరణ ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. మరోవైపు చేతి నోప్పితో బాధపడుతున్న ఆయన రెండు రోజుల నుంచి హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నొప్పితోనే బాబు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.