సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తర్వాత పిడిగుద్ధులు గుద్దడం , నేరాలు చేయడంలో జగన్ దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరులో ఇటీవల తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తర్వాత పిడిగుద్ధులు గుద్దడం , నేరాలు చేయడంలో జగన్ దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మత్తులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా అని చంద్రబాబు నిలదీశారు. 

టీడీపీ హయాంలో తుపానులు రాకముందే పంట చేతికి వచ్చేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చామని.. తాను కట్టాననే పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు బాలేదని, మురికి కాల్వలు గాలికి వదిలేశారని  , ఇసుకపై వున్న ప్రేమ వైసీపీ నేతలకు రైతులపై లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎవరి జీవన ప్రమాణాలు పెరగలేదని.. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఆంధ్రప్రదేశ్‌లో వున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read: Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’

రైతుల బాధను పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని, మిచౌంగ్ తుఫానుపై రైతులను ఏమాత్రం అప్రమత్తం చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. చివరికి గోనెసంచులు ఇచ్చినా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునేవారని .. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.