Asianet News TeluguAsianet News Telugu

ప్రశ్నిస్తే.. దేశద్రోహమా: రఘురామ అరెస్ట్‌పై చంద్రబాబు స్పందన

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై స్పందించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి కరోనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎంపీపై దేశ ద్రోహం పెడతారా అంటూ మండిపడ్డారు. 

tdp chief chandrababu naidu reacts ysrcp mp raghurama krishnam raju arrest ksp
Author
Amaravathi, First Published May 14, 2021, 8:24 PM IST

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌పై స్పందించారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి కరోనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎంపీపై దేశ ద్రోహం పెడతారా అంటూ మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాల కంటే కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా అని చంద్రబాబు నిలదీశారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని మరోసారి స్పష్టమైందని టీడీపీ చీఫ్ ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణంరాజు అరెస్ట్.. జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రశ్నకు సమాధానం అరెస్ట్‌లేనని.. ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమానమనే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తున్న సీఎంగా జగన్ రెడ్డి నిలిచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రఘురామకృష్ణమరాజు అరెస్టు జగన్ రెడ్డి ఉన్మాదానికి నిదర్శనమన్నారు. లోక్‌సభ సభ్యుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దేశ ద్రోహం కేసుతో అరెస్ట్ చేస్తారా అని ఆయన మండిపడ్డారు.

హిట్లర్, గడాఫీ వంటి నియంతల పాలన నేడు ఏపీలో కనిపిస్తోందని.. ప్రజలిచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారం కోసం వాడడం దుర్మార్గమన్నారు. అక్రమ అరెస్టులపై పెట్టే సమయం.. కరోనాపై ప్రజల ప్రాణాలు నిలుస్తాయని చంద్రబాబు హితవు పలికారు. ఆక్సిజన్ కోసం, మందుల కోసం, వ్యాక్సిన్ కోసం ప్రజలు అల్లాడుతున్నారని.. ఇదే సమయంలో ప్రభుత్వం పగ, ప్రతీకారం, కక్ష సాధింపుకోసం ఆరాటపడుతోంది

Follow Us:
Download App:
  • android
  • ios