రామతీర్థం సహా మరో మూడు దేవాలయాల ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్‌గా టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తొలగించడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇలాంటి సమయంలో దేవాలయం ఛైర్మన్ పోస్ట్ నుంచి తప్పిస్తారా అంటూ మండిపడ్డారు.

అశోక్ గజపతిని తప్పించడం కక్ష సాధింపేనని బాబు ఆరోపించారు. ప్రభుత్వం కోర్టుల్లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా, రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత అశోక్ గజపతి రాజును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ పదవి నుంచి ఆయనకు ఉద్వాసన పలికింది.

మిగిలిన మూడు ఆలయాల విషయానికి వస్తే.. రామతీర్థం, పైడితల్లి అమ్మవారు, మందపల్లి ఆలయాలు వున్నాయి. దేవాలయాల పర్యవేక్షణలో విఫలమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొంది దేవాదాయ శాఖ. ఇప్పటి వరకు 100 ఆలయాల ఛైర్మన్ బాధ్యతల నుంచి అశోక్‌ గజపతి రాజును తప్పించింది ప్రభుత్వం.