చిత్తూరు జిల్లాలో ఓ రైతు పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఇద్దరు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం బాలీవుడ్ నటుడు సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు.

దీంతో సోనూసూద్ వెంటనే స్పందించి.. వారికి ముందుగా రెండు  ఎద్దులు అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. తర్వాత కొద్దిసేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోవటంతో ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్లుగా ప్రకటించాడు.

Also Read:చిత్తూరు అక్కా చెల్లెళ్లకు సోనూ సూద్‌ సాయం... ఆ చేతికి ఎముకే లేదు!

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. అనేక మంది సోనూసూద్‌ను అభినందిస్తున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరారు.

ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని అభినందించిన చంద్రబాబు సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.