ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న బాలీవుడ్‌ నటుడి పేరు సోనూసూద్‌. ప్రస్తుతం దేశంలో కరోనా అన్న పేరు ఎంత పాపులరో సోనూ సూద్ అన్న పేరు కూడా అంతే పాపులర్‌. ఆ కష్టకాలంలో ఆ స్థాయిలో సేవ కార్యక్రమాలు చేశాడు సోనూసూద్‌. వేలది మందిని వందల బస్సుల్లో తమ సొంత గ్రామాలకు చేర్చిన సోనూ సూద్. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేశాడు.

అంతేకాదు సొంత గ్రామాలకు వెళ్లే ప్రయత్నంలో మరణించిన 400ల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేయనున్నట్టుగా ప్రకటించాడు సోనూ. తాజాగా ఈ విలక్షణ నటుడు తెలుగు రాష్ట్రాల్లో లాక్‌ డౌన్‌ వల్ల కష్టాలు పడుతున్న ఓ కుటుంబానికి సాయం చేసేందుకు రెడీ అయ్యాడు. గత రెండు రోజులు చిత్తూరు జిల్లాలోని ఓ కుటుంబానికి సంబంధించిన వార్త మీడియాలో వైరల్‌ అయ్యింది.

పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవటంతో ఇద్దుు బాలికలు కాడి లాగుతూ పొలం దున్నుతున్న వీడియో వైరల్ కావటంతో ఆ వీడియో సోనూ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించి సోనూ, వారికి ముందుగా రెండు ఎద్దులు అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే కొద్ది సేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోవటంతో ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. దీంతో మరోసారి సోనూ పేరు మోగిపోతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా సోనూ సాయం అధించటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.