టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్  ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదిలో వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులకు చేరడంతో నోటీసులు జారీ చేశారు.

చంద్రబాబుతో పాటు కృష్ణా కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. వరద కారణంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ చంద్రబాబు నివాసానికి అధికారులు నోటీసులు ఇవ్వడం పెద్ద దుమారం రేపింది.