రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు ఎవరు.. పెద్ద ఎక్స్‌పర్టా అని బాబు ప్రశ్నించారు. ఆయన గ్రూప్-1 ర్యాంక్ ఆఫీసర్ అని.. తన వద్ద పనిచేసిన వ్యక్తేనన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడాని కంటే ముందే మూడు రాజధానులు ఉంటాయని సీఎం ఎలా ముందు చెప్పగలిగారని బాబు ప్రశ్నించారు.

Also Read:చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

ఇదే విషయాన్ని జీఎన్ రావు తన నివేదికలో ఎలా ప్రస్తావించారని.. ఇదంతా పేపర్ లీకేనని, జగన్ చెప్పినట్లుగా రావు రాశారని టీడీపీ అధినేత ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రికి ఏ ప్రాంతంపైనా ద్వేషం ఉండకూడదన్నారు. రాజధానిపై అనిశ్చిత పరిస్ధితిని కొనసాగించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. బోస్టన్ కమిటీ, హైపవర్ కమిటీలు అందుకేనని చంద్రబాబు విమర్శించారు. 

రాజధాని ప్రాంత రైతులు పది రోజులుగా తిండి తిప్పలు మానీ నిరసనకు దిగారని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేశారని, రైతులపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read:చట్టపరంగా ఏదైనా చేసుకో.. నీ దయాదాక్షిణ్యాలపై లేను: జగన్‌కు బాబు సవాల్

గాయంపై కారం చల్లి వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. నిరసనల మధ్య సచివాలయానికి వెళ్లేందుకు జగన్ భయపడ్డారని.. ముందుగా ఆ మార్గంలో ట్రయల్ రన్ చేయించారని బాబు దుయ్యబట్టారు.

సీఎం నివాసంలో ప్రజాదర్బార్ రద్దు చేశారని.. 144 సెక్షన్ పెట్టించారని ఇది అప్రకటిత ఎమర్జెన్సీగా ఆయన అభివర్ణించారు. డబ్బులు సంపాదించే మార్గాన్ని ముందు జగన్ నేర్చుకోవాలని.. విశాఖలో భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు సిద్ధమా అని బాబు సవాల్ విసిరారు.

Also Read:పాపం పండే రోజు వస్తే దాక్కోలేరు: చంద్రబాబుపై నాని వ్యాఖ్యలు

డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ని చంపేశారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 43 వేల కోట్ల అవినీతిని చేసి సీబీఐకి అడ్డంగా బుక్కయ్యారని బాబు ఎద్దేవా చేశారు.

ధర్నాచౌక్‌కు బయల్దేరిన టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు అడ్డుకోవటంపై ప్రతిపక్షనేత ఫైరయ్యారు. అమరావతిలో తనకు ఇల్లు లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. కానీ తనకు జగన్‌లా ప్యాలెస్‌లు కట్టుకునే అలవాటు లేదని టీడీపీ చీఫ్ చురకలంటించారు.