అమరావతి:  అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ చేయాలనే యోచనలో  ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ విషయమై న్యాయ నిపుణులతో  చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని  ఏపీ సర్కార్ భావిస్తోంది.

Also read:ఏపీకి మూడు రాజధానులు: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత,మీడియాపై దాడి

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ పై కేబినెట్ సమావేశంలో చర్చించారు.వేల కోట్లు పెట్టుబడి పెట్టినా కూడ అమరావతిని అభివృద్ధిని చేయలేమని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించినట్టుగా సమాచారం. అమరావతిలో పెట్టే ఖర్చులో 10 శాతం ఖర్చు చేసినా కూడ విశాఖపట్టణం అభివృద్దిని చేసే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడినట్టుగా  సమాచారం.

Also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్: రాజధానిపై కీలక నిర్ణయం

 రాజధాని మార్పు ఎందుకుచేయాల్సి వచ్చిందో కూడ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని  సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని సబ్ కమిటీ సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సుమారు 4వేలకు పైగా ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా  సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది.

Also read:నేడే ఏపీ కేబినెట్ భేటీ: తేలనున్న అమరావతి భవితవ్యం, టెన్షన్ వాతావరణం

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో కొందరు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. . అనైతికంగా అప్పటి ప్రభుత్వ పెద్దలకు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు రాజధానిలో భూములను కట్టబెట్టారని ఈ కమిటీ నివేదిక తేల్చింది. ఈ విషయమై సమగ్ర విచారణ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.అప్పటి సీఎంకు వాటాలున్న కంపెనీ కూడ భూములు కొనుగోలు చేసినట్టుగా సబ్ కమిటీ నివేదిక తేల్చినట్టుగా మంత్రి పేర్నీనాని చెప్పారు. 

also read:బొత్స ఇల్లు ముట్టడి, ప్రకాశం బ్యారేజీపై రాకపోకల నిలిపివేత: కొనసాగుతున్న ఉద్రిక్తత

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్తకు ఇవ్వాలా, సీబీఐ, సీబీసీఐడీకి ఇవ్వాలా అనే విషయాన్ని న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం కొంత మొగ్గు చూపుతోందని సమాచారం.

2014 డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే  ముందే ఎందరు భూములను కొనుగోలు చేశారనే విషయమై ఈ నివేదిక తేల్చింది.ఈ నివేదికలో పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నాయి. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల కుటుంబసభ్యులు, బంధువులు, డ్రైవర్లు భూములు కొనుగోలు చేశారో దర్యాప్తు చేయాలని సర్కార్ భావిస్తోంది. 

రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలపై అధ్యయనం కోసం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.